క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళకు లవ్ లెటర్ రాసిన గ్రామ వాలంటీర్

  • Published By: nagamani ,Published On : August 4, 2020 / 05:11 PM IST
క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళకు లవ్ లెటర్ రాసిన గ్రామ వాలంటీర్

గ్రామస్తులకు సేవ చేయటానికి ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ లను ప్రవేశపెట్టింది. ప్రజలకు సంక్షే పథకాలను అందజేయటంతో పాటు వారికి ప్రభుత్వం తరుపునుంచి ఏమి కావాల్సి వచ్చినా వాలంటీర్లే చూసుకోవాలి.ఈ క్రమంలో అనంతపురం జిల్లా నార్పల మండలంలో ఉయ్యాల కుంట గ్రామంలోని ఓ మహిళ తనకు కుల క్యాస్ట్ సరిఫికెట్ కావాలని వచ్చిన మహిళతో గ్రామ వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తనను ప్రేమించాలంటూ వేధించటం మొదలు పెట్టాడు. దీంతో ఆమె ఏం చేయాలో తెలిక వాడి వేధింపులు భరించలేక మానసిక వేదన అనుభవించింది.

ఉయ్యాలకుంట గ్రామంలో సుబ్రమణ్యం అనే గ్రామ వాలంటీర్ గా విధులునిర్వహిస్తున్నాడు. అతని వద్దకు ఓ మహిళ కుల ధృవీకరణ పత్రం కోసం వచ్చింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. క్యాస్ట్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి అందులో ‘ఐ లవ్‌ యూ’ అంటూ రాసిన కాగితం ఒకటి ఆమె చేతికి ఇచ్చాడు. అదిది చూసి ఆమె తన భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతన్నినిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో పాటు ఏం చేసుకుంటావో చేస్కో ఫో..అంటూ సమాధానం చెప్పాడు. దీంతో బాధితురాలు ఆమె భర్త ఉన్నతాధికారులకు చెప్పగా వాళ్లుకూడా ఏమీ పట్టించుకోలేదు. దీంతో భార్యతో కలిసి అతను ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అన్నా అని పిలిచినా కనీస సంస్కారం కూడా తనకు ప్రేమ లేఖ రాసిన వాడిని ఉద్యోగనుంచి తొలగించాలనిలేదంటే తనలాంటి బాధ ఇంకెవరికైనా వస్తుందని ఇటువంటివాళ్లు వాలంటీర్లుగా ఉండకూడదని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. కాగా గతంలో కూడా అతను తనకు ఓ చీటీమీద ఇంగ్లీషులో రాసి ఇచ్చాడని కానీ నాకు ఇంగ్లీషు రాకపోవటంతో ఆ విషయం తనకు అర్థం కాలేదనుకుని మరో సారి సోమవారం (ఆగస్టు 3,2020)తెలుగులో రాసిచ్చాడని ఆమె వాపోయింది. మహిళలను వేధించడానికే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారా? అంటూ ఆమె కుటుంబ సభ్యులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.