ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 01:49 PM IST
ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు దిగుతున్నారు.. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన డుండ్రిగూడ మండలం కొల్లాపూర్‌ సమీపంలో ఒడిశాకు చెందిన వారు ఏపీ సరిహద్దులు దాటి సుమారు రెండు కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆ గ్రామస్తులు తమ భూములను ఆక్రమిస్తే సహించేది లేదంటూ నిరసనలకు దిగుతున్నారు..



గత కొంత కాలంగా నలుగుతున్న ఈ సమస్యపై డుంబ్రిగూడ మండల రెవిన్యూ అధికారులు స్పందించారు. ఆంధ్రా – ఒడిశా బోర్డర్ లో ఆంధ్రా సరిహద్దులు తెలిపేలా..ఒడిశా అధికారులు బోర్డును పాతారు. దీనిని వ్యతిరేకిస్తూ…ఆంధ్రా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువ పెరుగుతుండడంతో సరిహద్దులో ఒడిశా వాసులు ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ..అదే జరిగితే..ప్రాణాలు అర్పించైనా..తమ భూములు కాపాడుకుంటామని ఆంధ్రా వాసులు హెచ్చరిస్తున్నారు.



ఒడిశా వాసులు భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగుతున్నారు కొల్లాపూర్‌ గ్రామస్తులు. ఈ కుట్రలను సహించేది లేదని.. ఏపీ ప్రభుత్వం వెంటనే చొరవ చూపించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.