Flood In Kadapa : ఏపీలో వరద బీభత్సం : కడప జిల్లాలో 50 మంది మృతి

ఏపీలోని కడప జిల్లాలో వరదలు ముంచెత్తాయి. నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. నదిలో వరద ప్రవాహానికి కడప జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 50 మంది మృతిచెందారు.

Flood In Kadapa : ఏపీలో వరద బీభత్సం : కడప జిల్లాలో 50 మంది మృతి

Andhra Pradesh 50 Dead In Flash Flood In Kadapa District (1)

flash flood in Kadapa  : ఏపీలోని కడప జిల్లాలో వరదలు ముంచెత్తాయి. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. నదిలో వరద ప్రవాహానికి చాలామంది గల్లంతయ్యారు. కడప జిల్లాలోని మందపల్లి, పులపుత్తూరు గ్రామాలలో 50 మంది వరకు మృతిచెందినట్టు సమాచారం. రాజంపేట మండలం గుండ్లురు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను రిస్కీ టీం గుర్తించింది. పల పత్తూరు, మందపల్లిలో మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక బస్సు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. కడప జిల్లా అన్నమయ్య ప్రాజక్టు వరదనీటి ఉధృతిలో కొట్టుకుపోయిన యాబై మందిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగంలోకి దిగిన సీఆర్డీఎప్ టీమ్ మృతదేహాలను వెలికి తీస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు బయటపడుతున్నాయి.

నీటిలో చిక్కుపోయిన మూడు ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా బయటపడింది. బస్సులో చిక్కుపోయిన మృతి చెందిన వారి మృతదేహాల్లో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. కార్తిక మాస పూజలకు వెళ్ళి గల్లంతైన మందపల్లి, పులపత్తూరు‌లోని యాబై మృత దేహాల్లో ఇప్పటివరకూ నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 46మంది కోసం రెస్క్యూ టీమ్ తీవ్రంగా గాలిస్తోంది. పులపత్తూరు శివాలయంలో పూజారితో పాటు మరో ఐదుగురు గల్లంతయ్యారు.
వరద నీటి ఉదృతికి చోప్పావారిపల్లె వద్ద రోడ్డు క్రుంగి పోయింది.

రాజంపేట ప్రజలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మేడ
జిల్లాల్లో వరదలపై రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి స్పందించారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. రాజంపేట మండలం గుండ్లురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృత్యువాత పడ్డారు. పుల్లూరు మందపల్లి జలదిగ్బంధంలో ఉన్నాయన్నారు. వరద కష్టాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే మేడ తెలిపారు. ప్రజలకు సహాయం చేసేందుకు హెలికాప్టర్ కూడా తెప్పించినట్టు వెల్లడించారు.

వరద ప్రభావిత ప్రాంత ప్రజల కోసం ఐదువేల ఆహార పదార్థాలు సిద్ధం చేశామన్నారు. ప్రజలకు సహాయక చర్యలు అందే వరకు తాను అక్కడే ఉంటానని ఎమ్మెల్యే మేడ స్పష్టం చేశారు. ఈ రాత్రి లోపు అందరికీ ఆహారం తాగునీరు అందిస్తామన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది సహకారంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వరద ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులు స్పందించడాన్ని ఎమ్మెల్యే మేడా అభినందించారు.

Read Also : TDP : సైకో నా కొడుకులే కన్నీళ్లు చూసి ఆనందపడతారు – వంగలపూడి అనిత