ఏపీలో కరోనా పీక్ దాటేసిందా? తగ్గుతున్న కేసులు

  • Published By: sreehari ,Published On : August 17, 2020 / 06:57 PM IST
ఏపీలో కరోనా పీక్ దాటేసిందా? తగ్గుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పీక్ దాటేసిందా? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ఏపీలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ భారీగా కనిపించిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు కనిపిస్తోంది.. ర్యాపిడ్ టెస్టులు చేయడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.



రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయడంతో వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతూ వచ్చాయి.. ఇప్పుడప్పుడే కరోనా తీవ్రత తగ్గుతున్నట్టు కనిపిస్తోంది.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి..



ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా కేసుల సంఖ్య చాలావరకు పడిపోయింది.. ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 44,578 మంది నుంచి (VRDL+Truenat+NACO (25,114), Rapid Antigen (19,464) శాంపిల్స్ సేకరించగా.. వారిలో 6,780 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకినవారిలో పలు జిల్లాలకు చెందిన వారు మృతిచెందారు.



ప్రకాశంలో 13 మంది, తూర్పుగోదావరిలో 10 మంది, చిత్తూరులో 8 మంది, గుంటూరులో ఏడుగురు, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 7,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇప్పటివరకూ రాష్ట్రంలో 29,05,521 శాంపిల్స్ సేకరించారు.