Amul in W.Godavari : 142 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభం

ఏపీలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కొనసాగుతోంది. పాడి రైతుల నుంచి పాలు సేకరించి వారికి లాభాలు వచ్చే విధంగా చేయటానికి ఏర్పాటు చేసిన అమూల్ ప్రాజెక్టు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ప్రారంభైంది. 142 గ్రామాల్లో పాలసేకరణం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు,

Amul in W.Godavari : 142 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభం

Amul Project In W.godavari

AP Amul project in W.Godavari : ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణ కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాల్లో అమూల్ ప్రాజెక్టు కింద పాలసేకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఏపీలో ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ప్రారంభించారు. దీంట్లో భాగంగా జిల్లాలోని పాలసేకరణ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా..142 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. పాల సేకరణకు సంబంధించి 15 వేల మంది రైతులను అమూల్‌ సంస్థ గుర్తించింది. అమూల్ సంస్థ నుంచి పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా అమూల్‌ సంస్థ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రైతులకు మేం ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. ఈ అమూల్ సంస్థలో వాటాదారులంతా పాలు పోసే అక్కా చెల్లెళ్లే అని అన్నారు. ఆడబిడ్డల కోసం ఎటువంటి లాభాపేక్షా లేకుండా అమూల్ సంస్థ ముందుకొచ్చిందని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.

అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయని..ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ ద్వారా ఎంతోమంది పాడి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో పాడి రైతుల కష్టాల్ని చూశానని అప్పుడే వారికి హామీ ఇచ్చానని..ఇచ్చిన హామీ ప్రకారం వారి కోసం అమూల్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు లబ్ది చేకూరేలా చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ పాల సేకరణకింద చేసిన చెల్లింపుల్లో రూ. 24,54 కోట్ల రూపాయల్లో రూ.4.6కోట్లు అదనంగా వచ్చిందనీ ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మంచి జరిగుతుందని అన్నారు.