Anthrax In Visakha Manyam : విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ అలజడి .. 15మంది చిన్నారులతో సహా 40మందిలో ఆంత్రాక్స్ లక్షణాలు

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు 40మందికి ఆంత్రాక్స్ తో బాధపడుతున్నారు.వీరిలో 15మంది చిన్నారులే కావటం గమనించాల్సిన విషయం.

Anthrax In Visakha Manyam : విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ అలజడి .. 15మంది చిన్నారులతో సహా 40మందిలో ఆంత్రాక్స్ లక్షణాలు

Anthrax In Visakha Manyam

Anthrax In Visakha Manyam : విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు 40మందికి ఆంత్రాక్స్ తో బాధపడుతున్నారు.వీరిలో 15మంది చిన్నారులే కావటం గమనించాల్సిన విషయం. వారం రోజులుగా బాధితులు కురుపులతో బాధపడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఆంత్రాక్స్ కలకలం రేపటంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి బాధితుల నమూనాలు సేకరిస్తున్నారు. వైద్యసేవలు అందిస్తున్నారు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని విశాఖ కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపుతామని వైద్య అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. మృతి చెందిన మేకలను తినటంతో ఈ వ్యాధి సోకినట్లుగా భావిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామం దొరగుడలో ఆంత్రాక్స్ వ్యాధి తరహా లక్షణాలు బయటపడటం.. కలకలం రేపుతోంది. లక్ష్మీపురం పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన దొరగుడలో..ఈ వ్యాధి విజృంభిస్తోంది. కాగా ఇదే దొరగుడలో గతంలోనూ ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాతపడ్డారు. తాజాగా.. గ్రామంలో ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసి.. ఆశా కార్యకర్త ఫోటో తీసి వైద్యులకు పంపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌.. గురువారం (ఆగస్టు 25,2022) దొరగుడలో.. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. వైద్యాధికారుల బృందం గ్రామంలో పర్యటించి.. వైద్యపరీక్షలు నిర్వహించారు. 40 మందికి లక్షణాలు ఉండగా.. వారిలో ఏడుగురికి తీవ్ర లక్షణాలు ఉండటంతో.. వారి రక్తనమూనాలను సేకరించారు. విశాఖ కేజీహెచ్‌లోని ప్రయోగశాలకు రక్త నమూనాలు పంపుతామని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిర్ధరణకు వస్తామని వెల్లడించారు.