టూరిజం అవార్డ్స్… ఏపీ నెం.1

  • Published By: venkaiahnaidu ,Published On : September 27, 2019 / 12:20 PM IST
టూరిజం అవార్డ్స్… ఏపీ నెం.1

ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ ఏడాది వివిధ కేటగిరిల్లో మొత్తం 76 అవార్డులను అందజేశారు. 

పర్యాటక రంగంలో వృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఉత్తమ కాఫీ టేబుల్‌ బుక్‌ కేటగిరీలోనూ ఏపీకి ప్రథమస్థానం లభించింది. విశాఖ రైల్వే స్టేషన్‌ కు బెస్ట్ రైల్వే స్టేషన్ అవార్డు లభించింది. అడ్వెంచర్‌ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎంపికైంది.

తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన “ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ” అనే మొబైల్ యాప్‌ కు అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ కి జాతీయ స్థాయి పర్యాటక అవార్డు దక్కింది. ఐటీ సేవలను వినూత్నంగా వాడుకుంటున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. భారత్‌లో పర్యాటకులకు రెడ్ కార్పెట్‌ తో స్వాగతం పలుకుతున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు.