ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని టీడీపీ నిర్ణ‌యం

  • Published By: madhu ,Published On : June 15, 2020 / 06:25 AM IST
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని టీడీపీ నిర్ణ‌యం

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స‌మావేశాల‌కు టీడీపీ స‌భ్యులు హాజ‌ర‌వుతారా ? లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేయాల‌ని సూచిస్తున్నారంట టీడీపీ అధినేత బాబుకు. ఒక‌వేళ హాజ‌ర‌యితే..ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాల‌నే దానిపై వారితో చ‌ర్చిస్తున్నారు. 2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం ఉద‌యం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం ఆన్ లైన్ లో జ‌రిగింది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. 

స‌మావేశాల‌కు అటెండ్ కావాలా ? వ‌ద్దా ? త‌దిత‌ర ప‌రిణామాల‌పై చ‌ర్చిస్తున్నారు. నేత‌ల అరెస్టుల‌ను నిర‌సిస్తూ..స‌మావేశాల‌కు హాజ‌రు కాక‌పోడ‌మే బెట‌ర్ అని ప‌లువురు సూచిస్తున్నార‌ని స‌మాచారం. ఎందుకంటే..ఈఎస్ ఐ కుంభ‌కోణంలో బాబు రైట్ హ్యాండ్‌, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంన్నాయుడు అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీడీపీ గుర్రుగా ఉంది. నేత‌ల‌ను వేధిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. 

ఈ క్ర‌మంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. స‌మావేశాల‌కు అటెండ్ కావాలా ? వ‌ద్దా ? అనే దానిపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. చివ‌ర‌కు స‌మావేశాల‌కు హాజ‌రైతేనే బాగుంటుంద‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌లు అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని డిసైడ్ అయ్యారు. 

మ‌రోవైపు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండు రోజులు మాత్ర‌మే జ‌రుగ‌నున్నాయి. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో ప్ర‌భుత్వం ఈ విధంగా నిర్ణ‌యం తీసుకుంది. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించిన రోజునే..రాష్ట్ర బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆన్ లైన్ ద్వారా..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.

వెంట‌నే..ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చిస్తారు. ప‌రిమిత సంఖ్య‌లోనే స‌భ్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. తీర్మానం ఆమోదించిన అనంత‌రం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతారు. అసెంబ్లీ బ‌య‌ట‌, లోప‌ల ప‌లు ఏర్పాట్లు చేశారు అధికారులు.