AP CM Jagan Anakapalli Tour : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన..ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ  అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తికి సిద్ధమైంది.

AP CM Jagan Anakapalli Tour : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన..ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభం

AP CM Jagan Anakapalli Tour

AP CM Jagan Anakapalli Tour : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ  అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తికి సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో 2వేల 200 కోట్ల పెట్టుబడితో దాదాపు రెండువేల మందికి ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా కంపెనీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాల్లో విస్తరించి ఉంది.

మనదేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో మ్యాన్యూఫాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది. అత్యుతాపురం మూడో యూనిట్‌ను నెలకొల్పి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఏటీసీ టైర్స్‌ సెకండ్‌ ఫేజ్‌కు సీఎం జగన్‌ భూమి పూజ చేస్తారు. పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన పరిశ్రమకు భూమి పూజ నిర్వహిస్తారు. 202 కోట్ల పెట్టుబడి, 380 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఈ ప్లాంట్‌లో వాటర్‌ ప్రూఫింగ్‌ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్‌ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ విస్తరణకు భూమి పూజ నిర్వహిస్తారు.

CM YS Jagan: స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌కు సిఎం భూమి పూజ చేస్తారు. కార్బొనేటెడ్‌ ప్రూట్‌ డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, ప్రూట్‌ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్‌ బాటిల్స్‌ తదితర ఉత్పత్తుల బెవరేజెస్‌ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో 185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.