ఏపీ కరోనా కేసుల్లో కొత్త ట్రెండ్, కొత్త కేసులకన్నా డిశ్చార్జి కేసులు ఎక్కువ

  • Published By: Suresh Kumar ,Published On : September 12, 2020 / 06:20 PM IST
ఏపీ కరోనా కేసుల్లో కొత్త ట్రెండ్, కొత్త కేసులకన్నా డిశ్చార్జి కేసులు ఎక్కువ

ap corona cases Update: ఏపీలో కరోనా విజృంభన సాగుతూనే ఉంది. కేసులు పదివేలకు అటూ ఇటూగానే నమోదవుతున్నాయి. కాకపోతే నమోదువుతున్న కేసుల కన్నా డిశ్చార్జ్ అవుతున్న కేసులే ఎక్కువ. నెమ్మదిగా యాక్టీవ్ కేసుల సంఖ్య తగ్గుత్తున్నట్లే కనిపిస్తోంది.

24 గంటల్లో 76,465 శాంపిల్స్ పరీక్షించగా, 9901 పాజిటీవ్ కేసులు నమోదైయ్యాయి. మర 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 95,733 యాక్టీవ్ కేసులున్నాయి. కొత్తగా 10,292 మంది డిశ్చార్జి అయ్యారు.




ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1308 , పశ్చిమగోదావరి జిల్లాలో 1069 కొత్త కేసులు నమోదైయ్యాయి. ప్రకాశంలోనూ పాజిటీవ్ కేసులు వెయ్యిదాటేశాయ్. 1146 కేసలు నమోదైయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో 932 చొప్పున కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.