AP Corona Cases : ఆ రెండు జిల్లాలను వదలని కరోనా భయం.. రాష్ట్రంలో కొత్తగా కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,103 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,80,258కు చేరింది.

AP Corona Cases : ఆ రెండు జిల్లాలను వదలని కరోనా భయం.. రాష్ట్రంలో కొత్తగా కేసులు ఎన్నంటే..?

Ap Corona Cases (2)

AP Corona Cases : AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,103 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,80,258కు చేరింది.

ప్రస్తుతం 20,375 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా ఇప్పటివరకు 13,513 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1762 మంది మృతి చెందారు. ఇక కడప జిల్లాలో అతి తక్కువ మరణాలు సంభవించాయి. ఇక్కడ 627 మంది కరోనాతో మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా మృతుల సంఖ్య కృష్ణాలో నలుగురు, చిత్తూరు ముగ్గురు, కడప ముగ్గురు, గుంటూరు ముగ్గురు, పశ్చిమ గోదావరి ముగ్గురు, తూర్పుగోదావరి ఇద్దరు, అనంతపూర్ ఇద్దరు, నెల్లూరు ఇద్దరు. ప్రకాశం ఇద్దరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరుగా మరణించారు.

జిల్లాల వారీగా కేసులు

అనంతపురం 42. చిత్తూరు 231. ఈస్ట్ గోదావరి 438. గుంటూరు 216. వైఎస్ఆర్ కడప 82. కృష్ణా 192. కర్నూలు 26. నెల్లూరు 213. ప్రకాశం 186. శ్రీకాకుళం 53. విశాఖపట్టణం 81. విజయనగరం 29. వెస్ట్ గోదావరి 119. మొత్తం : 1,908

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 20 నుంచి 25 శాతం కేసులు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాలో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశమే..