AP Corona Cases : చిత్తూరు జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది.

Andhra pradesh
AP Corona Cases : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. ఇక కరోనాతో 8 మంది మృతి చెందారు. వైరస్ బారినుంచి కోలుకొని 797 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8134 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంది. మృతుల సంఖ్య కూడా చాలావరకు తగ్గింది. కరోనా వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్టణంలో ఒక్కరు చొప్పున చనిపోయారు.
Read More : భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
అనంతపురం 7, చిత్తూరు 104, తూర్పు గోదావరి 65, గుంటూరు 91, కడప 44, కృష్ణా 75, కర్నూలు 4, నెల్లూరు 68, ప్రకాశం 53, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 49, విజయనగరం 3, వెస్ట్ గోదావరి 50 మొత్తం : 629
Read More : శబరిమలలో ఆంక్షలు.. కరోనా తీవ్రతతో ప్రభుత్వం కీలక నిర్ణయం