AP Covid – 19 : ఏపీ భారీగా తగ్గిన కరోనా కేసులు..ఆరు జిల్లాల్లో ‘సున్నా’ కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు...

AP Covid – 19 : ఏపీ భారీగా తగ్గిన కరోనా కేసులు..ఆరు జిల్లాల్లో ‘సున్నా’ కేసులు

Ap Corona

Andhra Pradesh Covid-19 : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు రెండంకెల్లో రికార్డవుతున్నాయి. పలు జిల్లాల్లో తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. భారత్ లో ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో రాష్ట్రం అలర్ట్ అయ్యింది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తోంది. ఈ క్రమంలో…డిసెంబర్ 27వ తేదీ సోమవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో 54 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకున్నారా?

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,73,651 పాజిటివ్ కేసులకు గాను…20,58,062 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,490 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1 వేయి 099గా ఉందని తెలిపింది. ఆరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 17 వేల 940 శాంపిల్స్ పరీక్షించగా…54మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 121 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,11,99,604 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 0. చిత్తూరు 19. ఈస్ట్ గోదావరి 05. గుంటూరు 07. వైఎస్ఆర్ కడప 0. కృష్ణా 04. కర్నూలు 01. నెల్లూరు 05. ప్రకాశం 0. శ్రీకాకుళం 0. విశాఖపట్టణం 13. విజయనగరం 0. వెస్ట్ గోదావరి 0. మొత్తం : 54