Doctor donates her entire property: 50 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని గుంటూరు జీజీహెచ్‌కు రాసిచ్చిన వైద్యురాలు

డబ్బే లక్ష్యంగా, ఆస్తులు కూడబెట్టడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు కొందరు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు రోగులను భయపెట్టి మరీ వారి నుంచి వీలైనంత దోచుకుంటారు. ఎంత డబ్బు కూడబెట్టినా కొందరికి దానిపై ఉన్న ఆశ తగ్గదు. అటువంటిది ఓ వైద్యురాలు దాదాపు 50 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఓ ఆసుపత్రికి రాసిచ్చారు. గుంటూరు జీజీహెచ్‌కు తన రూ.20 కోట్ల ఆస్తిని రాసిచ్చి దానగుణాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆమె బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు.

Doctor donates her entire property: 50 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని గుంటూరు జీజీహెచ్‌కు రాసిచ్చిన వైద్యురాలు

Doctor donates her entire property: డబ్బే లక్ష్యంగా, ఆస్తులు కూడబెట్టడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు కొందరు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు రోగులను భయపెట్టి మరీ వారి నుంచి వీలైనంత దోచుకుంటారు. ఎంత డబ్బు కూడబెట్టినా కొందరికి దానిపై ఉన్న ఆశ తగ్గదు. అటువంటిది ఓ వైద్యురాలు దాదాపు 50 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఓ ఆసుపత్రికి రాసిచ్చారు. గుంటూరు జీజీహెచ్‌కు తన రూ.20 కోట్ల ఆస్తిని రాసిచ్చి దానగుణాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆమె బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు.

గుంటూరు జిల్లాకు చెందిన ఉమా గవి అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఆమె ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందారు. వారికి పిల్లలు లేరు. 1965లో ఆమె గుంటూరు వైద్య కళాశాలలో వైద్య కోర్సు చదివారు. ఆమె చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లారు. అక్కడే 40 ఏళ్లుగా వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో డల్లాస్‌లో గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా 17వ రీ యూనియన్‌ సమావేశాలు జరిగాయి.

తాను చదువుకున్న జీజీహెచ్‌కు విరాళం ఇస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. తన ఆస్తి మొత్తాన్ని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి (ఎంసీహెచ్‌ బ్లాక్‌) రాసిస్తానని తెలిపారు. దీంతో ఆ భవనానికి ఉమా గవి పేరును పెడతామని జింకానా సభ్యులు చెప్పగా, తన పేరు పెట్టవద్దని చెప్పారు. అయితే, ఆమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరు పెట్టాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఉమ అంతగా విరాళం ఇస్తానని చెప్పడంతో మిగతా సభ్యులు కూడా భారీగా విరాళాలు ప్రకటించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..