AP PRC : మరో ట్విస్ట్.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని నిర్ణయం

చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి...

AP PRC : మరో ట్విస్ట్.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని నిర్ణయం

Ap Prc

Andhra Pradesh Employees Steering Committee : ఏపీలో పీఆర్సీ రగడ పీక్స్‌కు చేరింది. మాటల్లేవ్.. చర్చలు అసలే లేవు అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. కొత్త పీఆర్సీపై కస్సుబుస్సుమంటున్న ఎంప్లాయిస్‌ యూనియన్స్ సమ్మెకు సిద్ధమయ్యాయి. 2022, జనవరి 24వ తేదీ సోమవారం సర్కార్‌కు సమ్మె నోటీసు ఇవ్వనుంది పీఆర్సీ స్టీరింగ్ కమిటీ. ఏపీలో సమ్మె సైరన్‌ మోగనుంది. కొత్త పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. సమ్మెతోనే తమ హక్కులను సాధించుకుంటామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. సీఎస్‌కు సమ్మె నోటీ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం సమ్మె నోటీస్‌ ఇవ్వనున్నారు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు.

Read More : Nadendla Manohar : ఫిబ్రవరి రెండో వారం వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి – నాదెండ్ల మనోహర్

విజయవాడలోజరిగిన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వడానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సిద్ధమవగా.. ఈలోపే వారిని మంత్రులు చర్చలకు ఆహ్వానించారు. సమ్మె నోటీసు ఇవ్వాలా.. మంత్రులతో చర్చలకు వెళ్లాలా అనేదానిపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చోపచర్చలు జరిపారు. దీంతో పాటు పీఆర్సీపై చర్చించేందుకు అసలు ప్రభుత్వం కమిటీ వేసినట్లు అధికారికంగా ఎక్కడ ఉత్తర్వులు రాలేదు. దీంతో చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి వ్యూహరచన చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.

Read More : ICC Awards: క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ!

మరోవైపు… పీఆర్సీపై పోరాటం కొనసాగుతుండగానే… ప్రభుత్వం మాత్రం జీవోలను అమలు చేసి తీరుతామంటోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తామంటూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలని ట్రెజరీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. కొత్త సాఫ్ట్‌వేర్‌లో జీతాల బిల్లులు అప్‌డేట్ చేయాలని సూచించింది. మంగళవారం లోగా ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రెజరీకి ఆదేశాలిచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను అప్‌లోడ్ చేయబోమంటున్నారు ట్రెజరీ ఉద్యోగులు. వారు కూడా పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
పీఆర్సీతో జీతాలు తగ్గవని ఏపీ సర్కార్… లేదు లేదు.. తప్పకుండా కొత్త జీవోలను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఏపీలో పరిస్థితులు సమ్మెకు దారితీశాయి. మరి సమ్మె నోటీసుతోనైనా ప్రభుత్వం దిగొస్తుందో లేదో చూడాలి.