ఏపీలో ఈఎస్ఐ అక్రమాలు ఎలా జరిగాయి? సూత్రధారులెవరు? పాత్రధారులెంతమంది?

టెండర్లు లేవు.. కానీ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. ఆర్డర్లు ఇచ్చారు.. కానీ మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు చెల్లింపులు జరిగాయి.

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 07:51 AM IST
ఏపీలో ఈఎస్ఐ అక్రమాలు ఎలా జరిగాయి? సూత్రధారులెవరు? పాత్రధారులెంతమంది?

టెండర్లు లేవు.. కానీ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. ఆర్డర్లు ఇచ్చారు.. కానీ మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు చెల్లింపులు జరిగాయి.

టెండర్లు లేవు.. కానీ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. ఆర్డర్లు ఇచ్చారు.. కానీ మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు చెల్లింపులు జరిగాయి. అత్తసొమ్ము అల్లుడు దానం టైపులో ప్రతీ అంశంలోనూ అక్రమాలకు తెరలేపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీన్‌లోకి ఎంటర్‌ కావడంతో కోట్ల రూపాయల అవినీతి బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏపీలో ఈఎస్‌ఐ అక్రమాలు ఎలా జరిగాయి..? ఇందులో సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు ఎంతమంది..?

రూ.150 కోట్ల స్కామ్‌:
ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్లాయ్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్ స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది. తీగ లాగితే మొత్తం 150 కోట్ల రూపాయల స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇంతపెద్ద కుంభకోణం ఎలా జరిగింది..? కాంట్రాక్ట్‌లు, ల్యాబ్‌లు, లీజులు, కొనుగోళ్ల పేరుతో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి..? విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తీగలాగితే మొత్తం డొంకంతా కదులుతుంది. ఆరోపణలతో మొదలైన స్కామ్ ఎపిసోడ్‌ అరెస్ట్‌ల దాకా వెళ్లడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. 

కొనుగోళ్లలో భారీ అక్రమాలు:
21 వేల కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు వారి జీతం నుంచి కొంత.. పనిచేసే కంపెనీ కొంత.. ప్రభుత్వం కొంత సొమ్ము జత చేయడం ద్వారా ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. క్లుప్తంగా ఇదే ఈఎస్‌ఐ. దీనికి సంబంధించి ముందుగా రాష్ట్రం ఖర్చు పెడితే.. ఆ తర్వాత ఈఎస్ఐ కార్పొరేషన్ వాటా డబ్బు రాష్ట్రానికి వస్తుంది. కార్మిక శాఖ పరిధిలో ఉండే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అనే సంస్థ దీని నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఏపీలో ఈఎస్‌ఐ కింద 4 హాస్పిటల్స్‌, 3 ల్యాబ్‌లు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొనుగోళ్లలోనే అక్రమాలు జరిగాయని చెబుతోంది విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.

రూ. 975.79కోట్ల విలువైన కొనుగోళ్లు.. ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే అక్రమాలు:
ఈఎస్‌ఐకి 2014-19 మధ్యకాలంలో ముగ్గురు డైరెక్టర్లు పనిచేశారు. వీరి హయాంలోనే కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెబుతున్నారు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. ఈ ముగ్గురి హయాంలో మొత్తం 975.79 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. వీటిలో 2012నాటి 51జీవోలోని నిబంధనలేవీ పాటించలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. డాక్టర్ రవి కుమార్ హయాంలో 325.21 కోట్లు.. సి కె రమేశ్ కుమార్ హయాంలో 227.71 కోట్లు.. జి విజయ కుమార్ హయాంలో 435.85 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. ఈ ముగ్గురి హయాంలో మందులు కొనడానికి 293 కోట్ల 51 లక్షలు కేటాయించగా.. వీళ్లు ఏకంగా 698 కోట్ల 36 లక్షల విలువైన మందులు కొనుగోలు చేశారు. అంటే అదనంగా 404.86 కోట్లు ఖర్చు చేశారని విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. స్పాట్..

రూ.38.56 కోట్లకు బదులు అదనంగా 51.02 కోట్లు:
2014-15 నుంచి 2018-19 సంవత్సరం వరకూ నాన్ రేట్ కాంట్రాక్టర్ల నుంచి 89.58 కోట్ల మందులు కొన్నారు. ఈఎస్ఐలో ముందుగా నమోదయిన రేట్ కాంట్రాక్టర్ల నుంచే మందులు కొనాలి. కానీ అలా జరగలేదు. నిజానికి ఇవే మందుల రేట్ కాంట్రాక్టర్ల నుంచి కొంటే 38.56 కోట్లకే వచ్చుండేవి. అంటే  51.02 కోట్లు అదనంగా చెల్లించారన్నమాట. ల్యాబ్ కిట్లు 237 కోట్లకు లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, అవంతర్ పెర్ఫార్మెన్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓమ్ని మెడి అనే సంస్థల నుంచి కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బయటి మార్కెట్ కంటే 36 శాతం అదనంగా అంటే 85 కోట్ల 32 లక్షల రూపాయల అధిక ధరకు కొన్నారు. పైగా ఓపెన్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో కొన్నారు. ఇక ల్యాబ్ సామాగ్రి కోసం కూడా నామినేషన్ పద్ధతిలో లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి 2.45 లక్షలకు కొనుగోలు చేశారు. నిజానికి ఈ రెండింటికీ టెండర్లు వేయకపోవడం మరో కొసమెరుపు.