Andhra pradesh government petition: 3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ సర్కారు

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Andhra pradesh government petition: 3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ సర్కారు

Next Chief Justice of India

Andhra pradesh government petition: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్ లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో తెలిపింది.

సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఏపీ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువస్తోందని అంటున్నాయి.