Andhra Pradesh High Court : ఏపీలో 27మంది న్యాయమూర్తులకు బదిలీలు .. పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ లో 27మంది జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో కొంతమందికి పదోన్నతులు ఇస్తూ బదిలీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh High Court : ఆంధ్రప్రదేశ్ లో 27మంది జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో కొంతమందికి పదోన్నతులు ఇస్తూ బదిలీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 27 మందిని హై కోర్టు బదిలీ చేసింది. నంబంబర్ (2022)21వ తేదీ లోపు రిలీవ్ అవ్వాలని సూచించింది.
కర్నూలు జిల్లా కోర్టు అదనపు జడ్జిగా పని చేస్తున్న వి.శ్రీనివాసులును కాకినాడ అదనపు మూడవ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎ.శ్రీనివాస్కుమార్ను నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న శాంతి నెల్లూరు మూడో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఈ కోర్టు బాధ్యతలను తాత్కాలికంగా కర్నూలు 6వ అదనపు జిల్లా జడ్జికి అప్పగించారు.
కర్నూలు జిల్లాలోని నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న ఎం.సువర్ణరాజు విశాఖ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కడప మూడో అదనపు జిల్లా జడ్జి పి.వాసును నియమించారు. ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న డి.అమ్మన్నరాజు ఒంగోలు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆ కోర్టు బాధ్యతలను కూడా తాత్కాలికంగా కర్నూలు 6వ అదనపు జిల్లా జడ్జికి అప్పగించారు. ఇలా పలువురు జడ్జీలను ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు.