TTD: టీటీడీలో నేర చరిత్ర ఉన్నవారిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది.

TTD: టీటీడీలో నేర చరిత్ర ఉన్నవారిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ

High Court Of Andhra Pradesh Key Comments On Amaravati

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గతంలోనే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

మొత్తం 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. కోర్టు వివరణ కోరినా కూడా ఇప్పటివరకు ఎవరూ కౌంటర్ దాఖలు చెయ్యలేదు. ముగ్గురు సభ్యులు నోటీసులు కూడా తీసుకోలేదు. ఇదే విషయాన్ని పిటీషనర్ కోర్టుకు తెలియజేశారు.

నోటీసులు తీసుకుని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, MN శశిధర్‌లపై పిల్ ఫైల్ అయినట్టు పేపర్లలో ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.