Andhra Pradesh: బటన్ నొక్కనున్న సీఎం జగన్..! తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ..

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు సమకూరింది.

Andhra Pradesh: బటన్ నొక్కనున్న సీఎం జగన్..! తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ..

AP News

Andhra Pradesh: ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు కల్యాణమస్తు, షాదీతోఫా పథకాల కింద లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీలోని వివిధ ముఖ్యమైన వార్తల వివరాలు ఇలా..

దుర్గమ్మ హుండీల లెక్కింపు ..

విజయవాడలోని ఇంద్రకీలాద్రి‌పై దుర్గమ్మ హుండీల లెక్కింపు జరిగింది. 21రోజులకుగాను హుండీలను లెక్కించగా 3కోట్ల 04 లక్షల 15 వేల 551 ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సగటున ఒక్క రోజుకు 14.48 లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. బంగారం 846 గ్రాములు,‌ వెండి నాలుగు కేజీల 973 గ్రాములుగా గుర్తించారు. ఆన్‌లైన్‌ ఈ హుండీ ద్వారా 1,35,528 ల ఆదాయం సమకూరింది.

తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం రామచంద్రపురంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రామచంద్రపురం మండలం వెగాయ్యమ్మపేటకు చేరుకుని అక్కడ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలన చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కడియంలో పంట పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌లతో ములాఖత్ అవుతారు. అనంతరం రాజమండ్రి తిలక్ రోడ్డులోని ఆదిరెడ్డి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మలను పరామర్శిస్తారు. రాత్రికి రాజమండ్రిలో చంద్రబాబు బస చేస్తారు.

తిరుమల సమాచారం..

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు సమకూరింది. తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సర్వదర్శనం కోసం 13 కంపార్ట్మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

శ్రీకాకుళం ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లాలోని గోపినగర్ వద్ద నాగావళి నది బ్రిడ్జిపై గొర్రెల మందపైకి ఐచర్ వ్యాను దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 65 గొర్రెలు మృతి చెందాయి. ఇద్దరు గొర్రెల కాపర్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున 2.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రావుల‌పాలెం నుండి ఒరిస్సాలోని బలుగాంకి అరటిపండ్ల లోడ్‌తో ఐచర్ వ్యాన్ వెళ్తుంది. దాదాపు ఎనిమిది లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందంటూ గొర్రెల కాపర్లు లబోదిబోమంటున్నారు.

కల్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయం..

ఏపీ ప్రభుత్వం శుక్రవారం కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద లభ్ధిదారులకు ఆర్థికసాయం నిధులు విడుదల చేయనుంది. మొత్తంగా 12,132 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.87.32 కోట్లను సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. SC, ST, మైనార్టీలకు రూ. లక్ష చొప్పున, కులాంతర వివాహాలకు 1.2 లక్షలు, బీసీలకు 75 వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు 75 వేలు, దివ్యాంగులకు 1.5 లక్షలు, భవన కార్మికులకు రూ.40 వేలు వధువు తల్లి ఖాతాకు జమ చేస్తారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారదా పిఠాధిపతి స్వరూపానంద స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామిజీ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి.

కేఏ పాల్ ఆమరణ దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన కేఏ పాల్. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటన.

బాలినేని మీడియా సమావేశం
బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలినేని అసంతృప్తి వ్యవహారం. ఈ నేపథ్యంలో బాలినేని మీడియా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.