Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్

ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలుచాచింది. ఓ విద్యార్దిని 11మంది సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేశారు. దీంతో 11మంది విద్యార్దులపై సస్పన్షన్ వేటు వేశారు.

Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్

Kakinada Jntu Ragging (1)

Ragging In JNTU : ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలుచాచింది.ఇంటరాక్షన్ పేరుతో ఓ విద్యార్దిని 11మంది సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేశారు. ఫస్ట్ ఇయర్ పెట్రో కెమికల్ కోర్టు చదువుతున్న విద్యార్ధి హాస్టల్ లో వేధింపులకు గురి అయ్యడు. ఈ విషయం యూనివర్శిటీ అధికారులకు తెలియటంతో వెంటనే చర్చలు తీసుకున్నారు. 11మంది విద్యార్దులపై సస్పన్షన్ వేటు వేశారు.

యూసీజీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ లో విద్యార్థి స్నేహితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. దీంతో ర్యాగింగ్‌ చేసింది నిజమేనని తెలియడంతో.. మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుండి, 15 రోజుల పాటు క్లాస్ ల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సస్పెండ్ అయినవారిలో ఇద్దరు సెకండ్ ఇయర్ చదువుతుండగా మరో తొమ్మిది మంది సీనియర్లు కాగా థర్డ్ ఇయర్ విద్యార్ధులు ఉన్నారు.