AP Covid : ఏపీకి బిగ్ రిలీఫ్.. 24 గంటల్లో 253 కేసులు, ఇద్దరు మృతి

రాష్ట్రంలో 3,30,30,124 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 718కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

AP Covid : ఏపీకి బిగ్ రిలీఫ్.. 24 గంటల్లో 253 కేసులు, ఇద్దరు మృతి

Ap Covid Updates

AP Corona Cases : ఏపీలో కరోనా వైరస్ ముగిసినట్లేనా ? ఎందుకంటే గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నాయి. కేవలం 100 నుంచి 300లోపున పాజిటివ్ బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 432 కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 635 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Read More : Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 374 కరోనా కేసులు

నేటి వరకు రాష్ట్రంలో 3,30,30,124 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 718కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,964. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,97,065. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5 వేల 181గా ఉంది.

Read More : Omicron : ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 27. చిత్తూరు 27. ఈస్ట్ గోదావరి 39. గుంటూరు 40. వైఎస్ఆర్ కడప 10. కృష్ణా 20. కర్నూలు 04. నెల్లూరు 08. ప్రకాశం 16. శ్రీకాకుళం 01. విశాఖపట్టణం 22. విజయనగరం 02. వెస్ట్ గోదావరి 37.
మొత్తం : – 253

Read More : Covid-19 : కరోనా వైరస్ నుండి బయటపడ్డా…. గుండెకు ముప్పే
గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 15,102 కేసులు, 278 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,64,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.38 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 1.28 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. మంగళవారం కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.