Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, 24 గంటల్లో 528 కేసులు, ఇద్దరు మృతి

24 గంటల వ్యవధిలో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....

Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, 24 గంటల్లో 528 కేసులు, ఇద్దరు మృతి

Covid 19 In Ap

Andhra Pradesh New Covid 19 Cases : ఏపీలో కరోనా వైరస్ తోకముడుస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై ప్రాంతీయ అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఇక ఏపీ విషయానికి వస్తే..వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది.

Read More : covid-19 Vaccination : 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్న రాష్ట్రం..

24 గంటల వ్యవధిలో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 101, పశ్చిమ గోదావరి జిల్లాలో 92 కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూశాయి. 22 వేల 339 శాంపిల్స్ పరీక్షంచగా 528 మందికి కోవిడ్ సోకిందని తేలిందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1864 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారని, నేటి వరకు రాష్ట్రంలో 3,29,16,247 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.

Read More : COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 20. చిత్తూరు 40. ఈస్ట్ గోదావరి 101. గుంటూరు 73. వైఎస్ఆర్ కడప 27. కృష్ణా 57. కర్నూలు 21 నెల్లూరు 21. ప్రకాశం 32. శ్రీకాకుళం 4. విశాఖపట్టణం 31. విజయనగరం 09. వెస్ట్ గోదావరి 92. మొత్తం : – 528