Andhra Pradesh: కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: న‌క్కా ఆనంద‌బాబు

వైసీపీ నేత కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లాలో ఆయ‌న నేడు 10 టీవీతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుని టిక్కెట్టు తెచ్చుకున్న చరిత్ర కొడాలి నానిదని విమ‌ర్శించారు.

Andhra Pradesh: కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: న‌క్కా ఆనంద‌బాబు

Andhra Pradesh: వైసీపీ నేత కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లాలో ఆయ‌న నేడు 10 టీవీతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుని టిక్కెట్టు తెచ్చుకున్న చరిత్ర కొడాలి నానిదని విమ‌ర్శించారు. రెండుసార్లు చంద్రబాబు బీఫాం ఇస్తే ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఇప్పుడు త‌మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌న్న ఏక్‌నాథ్‌

కొడాలి నాని వంటి చిల్లర వ్యక్తి మాట్లాడిన మాటల్ని ప్రజలు నమ్మరని ఆయ‌న అన్నారు. అధికార మదంతో వెనక గూండాలు, రౌడీలు ఉన్నారని ఇష్టానుసారం ఆయ‌న‌ మాట్లాడుతున్నార‌ని న‌క్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను, వైఎస్సార్ ను ఒకే వేదిక మీదికి తెస్తున్నారంటే ఇంతకన్నా రాజకీయ దిగజారుడుతనం ఏముంటుంద‌ని ఆయ‌న నిల‌దీశారు.