Andhra Pradesh : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి.. వారికే అవకాశం

ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది ఈ రోజు నామినేటెడ్ పోస్టులను ప్రకటించనున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జాబితాను ఫైనల్ చేశారు. మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Andhra Pradesh : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి.. వారికే అవకాశం

Andhra Pradesh (8)

Andhra Pradesh : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది ఈ రోజు నామినేటెడ్ పోస్టులను ప్రకటించనున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జాబితాను ఫైనల్ చేశారు. మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

దాంతోపాటు ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారు, మేయర్ పదవులు వదులుకున్న వారు.. మొదటి నుంచి పార్టీలో ఉన్నా అవకాశం దక్కనివారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కనుంది. సివిల్ సప్లైస్, ఆర్టీసీ, ఫైనాన్స్ ఫుడ్ కార్పొరేషన్, మైనింగ్ విభాగాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నామినేటెడ్ పోస్టుల రేసులో దేవినేని అవినాష్, నవీన్ నిశ్చల్, ఆమంచి కృష్ణమోహన్, దొరబాబు, శివశంకర్ రెడ్డి, మొండితోక అరుణ్, తోట వాని, బండి పుణ్యశ్రీలకు పదవులు దక్కే అవకాశం ఉంది.

ఇక ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొత్త ట్విస్ట్ నెలకొంది. నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలకు ఉన్న కార్పొరేషన్ పదవులను తొలగించనున్నట్లు సమాచారం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజా, ఏపీఐఐసీ చైర్మన్ రోజా పదవులను వేరేకరికి అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

కాగా మరికొద్ది సేపట్లో నామినేటెడ్ పోస్టుల జాబితాను మంత్రులు వేణుగోపాల కృష్ణా, సుచరిత విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు పూర్తి చేశారు. ఈ జాబితాలో ప్రధానంగా జోడు పదవులు ఎవరైతే ఉన్నారో.. వారికి నామినేటెడ్ పదవి నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ఇతరులకు కేటాయించింది. పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీకోసం పనిచేసిన వారికి న్యాయం చేసేందుకే జోడు పదవులకు స్వస్తిపలికినట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో పదవి అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో మహిళలకు 50 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 50 శాతం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.