పుచ్చకాయ ట్రక్కుల్లో రూ.4లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 05:21 AM IST
పుచ్చకాయ ట్రక్కుల్లో రూ.4లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు

గవర్నమెంట్ నిర్ణయాన్ని పక్కకు పెట్టి భారీ మొత్తంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిందో ముఠా. గుంటూరు రూరల్ పోలీసులు ఎంటర్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ట్రక్ డ్రైవర్లు పుచ్చకాయల లోడ్ వేసిన రైతు పేరు చెప్పడానికి నిరాకరిస్తున్నారు.  

డ్రైవర్లతోనే లోడ్ మొత్తం కిందకు దింపించారు పోలీసులు. మొత్తం 2వేల 330 లిక్కర్ బాటిళ్లను మూడు ట్రక్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్టాక్ ఖరీదు దాదాపు రూ.4లక్షల వరకూ ఉండొచ్చని ఎస్పీ సీహెచ్ విజయారావు అన్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, డ్రైవర్లతో పాటు మూడు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ స్మగ్లింగ్ ఇంకా 25మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్లలో తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ టీంలు మరో రూ.6లక్షల విలువైన మద్యం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు. 

అంతర్రాష్ట్ర సరిహద్దులన్నింటిలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న లిక్కర్ ను అడ్డుకుంటున్నాం. 14 టీంలు, 8జిల్లా సరిహద్దుల, 5 అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసిందని విజయారావు అన్నారు. 

లిక్కర్ బాటిళ్లు అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు. లిక్కర్ స్మగ్లింగ్ చేస్తే ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేశారు ఎస్పీ.