AP Politics : గన్ మెన్ లేకుండానే తిరుగుతున్నా..ఏం జరుగుతుందో చూస్తా..రెండు రోజుల్లో సంచలనాలు బటయపెడతా : పయ్యావుల
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది దీంతె పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు.రెండు రోజుల్లో సంచలనాలు బయటపెడతానంటూ ఆయనో ట్విస్ట్ ఇచ్చారు.

Payyavula Keshav Gun Mans Issue
twists in payyavula keshav gun mans issue : టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. పయ్యావులకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.భద్రతపై గంటకో రకంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు.
కాగా పయ్యావులకు ముందుగా భద్రత ఉపసంహరించి, ఆ తర్వాత కొనసాగిస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు. ఇలా ఆయనకు భద్రత కల్పించే విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఓవ్యక్తి వచ్చి మీకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించారంటూ కొత్త గన్‌మెన్ పయ్యావులకు పరిచయం చేసుకున్నారు. కానీ ఆ తరువాత అతను ఎటువెళ్లాడో ఏమయ్యాడో కూడా తనకు తెలియదని అతను కనిపించట్లేదంటూ తెలిపారు. దీంతో తాను గన్ మెన్ లేకుండానే తిరుగుతున్నానని ఏం జరుగుతుందో చూద్దాం అంటూ చెప్పుకొచ్చారాయన. ఈ పరిస్థితుల్లో పయ్యావుల రెండు రోజుల్లో సంచలనాలు బయటపెడతాను అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ సంచలనాలు ఏమిటో తెలియాల్సి ఉంది.