AP Covid Cases : ఏపీలో కొత్తగా 12,634 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 634 కోవిడ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

AP Covid Cases : ఏపీలో కొత్తగా 12,634 కోవిడ్ కేసులు

Ap Covid Cases

AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 634 కోవిడ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 10,30,665 కు చేరింది.

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 62, 885 మందికి పరీక్షలు నిర్వహించామని ఆ ప్రకటనలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69 మంది మరణించగా.. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది మరణించారు. కోవిడ్ వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 7,685 కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 89,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి చికిత్స పొంది 4,304 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,33,248 కి చేరింది. ఏపీలో ఇంతవరకు 1,59,94,607 శాంపిల్స్ ను పరీక్షించారు.

Ap Covid Bulletin

Ap Covid Bulletin