AP Covid : 24 గంటల్లో 13,474 కేసులు.. ఒక్కరోజులో 9 మంది మృతి

41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్...

AP Covid : 24 గంటల్లో 13,474 కేసులు.. ఒక్కరోజులో 9 మంది మృతి

Ap Covid 19 Cases

Andhra Pradesh Corona : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమౌతున్నాయి. బుధవారం 13వేల 618 కరోనా కేసులు నమోదయితే…గత 24 గంటల్లో 13 వేల 474 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు 2022, జనవరి 27వ తేదీ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్ కేసులకు గాను 21,09,080 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

Read More : Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

14,579 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,09,493గా ఉందని తెలిపింది. కరోనా కారణంగా విశాఖపట్టణంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,23,25,140 శాంపిల్స్ పరీక్షించారు.

Read More : AP New Districts : ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బాలకృష్ణ.. సీఎం జగన్‌‌కు విజ్ఞప్తి

జిల్లాల వారీగా : – 
అనంతపురం 980. చిత్తూరు 328. ఈస్ట్ గోదావరి 1066. గుంటూరు 1342. కడప 2031. కృష్ణా 873. కర్నూలు 1835. నెల్లూరు 1007. ప్రకాశం 1259. శ్రీకాకుళం 259. విశాఖపట్టణం 1349. విజయనగరం 469. వెస్ట్ గోదావరి 676 : మొత్తం – 13,474