Covid-19 Andhra Pradesh : ఏపీలో కరోనా, 24 గంటల్లో 16 వేల 167కేసులు..104 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Covid-19 Andhra Pradesh : ఏపీలో కరోనా, 24 గంటల్లో 16 వేల 167కేసులు..104 మంది మృతి

Ap Corona

COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరిలో 13 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 2 వేల 967 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, విశాఖలో 11 మంది, అనంతపూర్ లో 9 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో
ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 1472. చిత్తూరు 2967. ఈస్ట్ గోదావరి 2325. గుంటూరు 991. వైఎస్ఆర్ కడప 776. కృష్ణా 682. కర్నూలు 981. నెల్లూరు 1137. ప్రకాశం 1069. శ్రీకాకుళం 679. విశాఖపట్టణం 1434. విజయనగరం 562. వెస్ట్ గోదావరి 1092. మొత్తం : 16,167.

Read More : Wedding Venue: ఆనందం పట్టలేక వేదికపైనే వరుడికి ముద్దిచ్చిన వధువు