AP Corona : ఏపీకి రిలీఫ్.. కరోనా తగ్గుముఖం.. గణనీయంగా పెరిగిన రికవరీలు

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.

AP Corona : ఏపీకి రిలీఫ్.. కరోనా తగ్గుముఖం.. గణనీయంగా పెరిగిన రికవరీలు

Andhra Pradesh Reports 6 Thousand 617 New Corona Cases

AP Corona : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6వేల 617 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,397 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 57 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 228 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు 18,26,751 మంది కరోనా బారిన పడ్డారు. 17,43,176 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 12వేల 109 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(జూన్ 16,2021) కరోనా బులెటిన్ విడుదల చేసింది.

కొత్త కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్టడంతో.. ప్రభుత్వంతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. క‌రోనా కేసులు తగ్గుతుండ‌టంతో వ్యాక్సిన్‌పై ప్రభుత్వం ప్రధానంగా ఫోక‌స్ పెట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఇక థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా.. ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది.