Andhra Pradesh Corona : ఏపీలో కరోనా సునామీ.. ఒక్కరోజే 11వేలకు పైగా కొత్త కేసులు, 37 మరణాలు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.

Andhra Pradesh Corona : ఏపీలో కరోనా సునామీ.. ఒక్కరోజే 11వేలకు పైగా కొత్త కేసులు, 37 మరణాలు

Andhra Pradesh Corona Cases

Andhra Pradesh Corona Cases : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు. కరోనాతో తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరులో నలుగురు చొప్పున.. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశంలో ఒకరు మరణించారు.

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 10,20,926కి చేరింది. మృతుల సంఖ్య 7వేల 616కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం(ఏప్రిల్ 24,2021) కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,641 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1581 కేసులు, చిత్తూరు జిల్లాలో 1306 కేసులు నమోదయ్యాయి.

రోజురోజుకూ కేసుల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. అధిక సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల పాలవుతున్నా… ముందస్తు జాగ్రత్తలు పాటించడాన్ని కొందరు విస్మరిస్తున్నారు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలో కరోనా తొలి కేసు గతేడాది(2020) మార్చిలో నమోదైంది.