మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్!

  • Published By: madhu ,Published On : August 9, 2020 / 06:20 AM IST
మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్!

ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.

ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవలే లేఖ రాసినట్లు సమాచారం. పీఎం మోడీని ఆహ్వానించేందుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. ప్రత్యక్షంగా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ పాల్గొనాలని ప్రభుత్వం కోరుతోంది.

పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీకి మూడు రాజధానులుంటాయి. ఈ రాజధాని అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో..ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండడం, తర్వాత..మళ్లీ రెండు నెలల పాటు ముహుర్తాలు లేవని ప్రభుత్వం భావిస్తూ…ఆగస్టు 16వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

వీలైనంత తర్వగా ప్రధానితో అపాయింట్ మెంట్ ఖరారు చేస్తే..ముఖ్యమంత్రి ఆయన్ను స్వయంగా కలిసి రెండు ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించి ఆహ్వానిస్తారని లేఖలో వెల్లడించారు.