Scuba Diving Academy : ఏపీలో స్కూబా డైవింగ్ అకాడమీ

ఆంధ్రప్రదేశ్ లో తర్వలోనే స్కూబా డైవింగ్ అకాడమీ అందుబాటులోకి రానుంది.

Scuba Diving Academy : ఏపీలో స్కూబా డైవింగ్ అకాడమీ

Scuba Diving Academy ఆంధ్రప్రదేశ్ లో తర్వలోనే స్కూబా డైవింగ్ అకాడమీ అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలోని చింతపల్లి(తీరప్రాంత గ్రామం)లో ఈ స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్(APTDC) సహకారంతో జల క్రీడా కార్యక్రమాలను నిర్వహించే వైజాగ్ కి చెందిన “లైవ్ ఇన్ అడ్వెంచర్స్” ఈ ఏడాది అక్టోబర్ నుంచి అకాడమీని ఆపరేట్ చేయనుంది. ఏపీటీడీసీకి చెందిన నాలుగు ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో స్కూబా డైవింగ్ కి అతిపెద్ద గమ్యస్థానంగా చింతపల్లి గ్రామం మారనుంది.

ఏపీటీడీసీ మరియు లైవ్ ఇన్ అడ్వెంచర్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం…పర్యాటకుల అవసరాలను తీర్చేవిధంగా చింతపల్లి వద్ద ఓ స్కూబా డైవింగ్ అకాడమీ,బీచ్ రిసార్ట్ అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా చింతపల్లిలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ని కూడా ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. కాగా,ఏపీడీసీ ఇప్పటికే చింతపల్లిలో ఆరు రూములతో కూడిన ఓ రిసార్ట్ ని నిర్మించినప్పటికీ దాన్ని ఇంకా ప్రారంభించలేదు.

లైవ్ ఇన్ అడ్వెంచర్స్ ఎండీ బలరాం నాయుడు మాట్లాడుతూ…అకాడమీ ఏర్పాటు కోసం రూ.2కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అకాడమీ.. ప్రారంభంలో వినోదం కోసం ఉంటుంది. ఆ తర్వాత ప్రాధమికం(బేసిక్) నుండి డైవింగ్ వరకు ఉన్న కోర్సులను అందిస్తుంది. బోట్ రైడింగ్ లో కోర్సులు మరియు కయాకింగ్ లో కోర్సులను కూడా అకాడమీ అందిస్తుంది. వైజాగ్ మరియు విజయనగరం జిల్లాల్లో గొప్ప సముద్ర జీవితం గురించి అవగాహనని అకాడమీ అందిస్తుందని బలరాం నాయుడు తెలిపారు.

మరోవైపు,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(SAAP) రిషికొండ(వైజాగ్ లోని గీతం యూనివర్శిటీ ఎదురుగా ఉంటుంది)లో ఓ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తోంది. వైజాగ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(DSA)అధికారి ఎన్ సూర్యారావ్ మాట్లాడుతూ..మేము ఓ కోచ్ ని నియమించాం. అక్టోబర్ నుంచి సెంటర్ ని ప్రారంభించి సర్ఫింగ్,యాచింగ్,కయాకింగ్ లో ట్రైనింగ్ ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.