Y +Security for Ramachandra yadav : పుంగనూరు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌కు Y+ భద్రత కల్పించిన కేంద్రం

పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌కు Y+ భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై 300మంది హత్యాయత్నం చేశారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోమ్ శాఖ 14మందితో రామచంద్ర యాదవ్ కు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Y +Security for Ramachandra yadav : పుంగనూరు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌కు Y+ భద్రత కల్పించిన కేంద్రం

Y + security for Ramachandra yadav

Y + security for Ramachandra yadav : పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌కు Y+ భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై 300మంది హత్యాయత్నం చేశారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోమ్ శాఖ 14మందితో రామచంద్ర యాదవ్ కు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పుంగనూరులో రామచంద్ర యాదవ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రభుత్వ విధానాలను కూడా విమర్శిస్తుంటారు. దీంతో అధికారపార్టీకి చెందిన నేతలు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడికిపాల్పడ్డారని ఆరోపించారు. 300లమంది తనపై హత్యాయత్నం చేశారని కాబట్టి నాకు భద్రత కల్పించండీ అంటూ జనవరి (2023) కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేయగా Y+ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పుంగనూరులో తన ఇంటి దాడి, హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. దీంతో త్వరలోనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని అమిత్ షా భరోసా ఇచ్చారని రామచంద్రయాదవ్ చెప్పారు. ఈక్రమంలో ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ద్వారా Y+ కేటగిరి భద్రత మంజూరు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర సాయుధ బలగాలు కూడా పుంగనూరుకు చేరుకున్నట్లుగా సమాచారం.