ఆంధ్రాలో భారీ వర్షాలు: తీర ప్రాంతాలకు హెచ్చరిక

ఆంధ్రాలో భారీ వర్షాలు: తీర ప్రాంతాలకు హెచ్చరిక

రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రాష్ట్రంతో పాటు రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఉత్తర తీర ప్రాంతాలతో పాటు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలులో భారీ వర్షం కురవనుంది. 

భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ, విశాఖపట్నంలో భారీ ప్రభావం కనిపించనుంది. 50కి.మీ వేగంతో బలమైన గాలలు వీచే అవకాశాలు ఉన్నాయి. 

విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా ఇవే సూచనలు చేసింది. సముద్ర తీర ప్రాంతం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత వారంలో వచ్చిన వరదల కారణంగా కృష్ణా బేసిన్ భారీగా నష్టపోయింది. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న 90గ్రామాల వరకూ ఘోరంగా నష్టపోయాయి. 8వేల మంది బాధితులకు 56రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రమాదం నుంచి కాపాడారు.