covid 19 cases : ఏపీలో కరోనా..24 గంటల్లో 368 కేసులు

covid 19 cases : ఏపీలో కరోనా..24 గంటల్లో 368 కేసులు

Andhra Pradesh Corona

andhrapradesh :  ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 2188 యాక్టివ్‌ కేసులుండగా..రాష్ట్రవ్యాప్తంగా 2021, మార్చి 20వ తేదీ శనివారం 31 వేల 138 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,47,36,326 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : –

అనంతపురం 40. చిత్తూరు 40. ఈస్ట్ గోదావరి 20. గుంటూరు 79. వైఎస్సార్ కడప 10. కృష్ణా 37. కర్నూలు 49. నెల్లూరు 20. ప్రకాశం 06. శ్రీకాకుళం 10. విశాఖ పట్టణం 39. విజయనగరం 09. వెస్ట్ గోదావరి 09. మొత్తం 368.

రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ప్రతి రోజు 200 లకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం భయపెడుతోంది. భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయడంపై ఫోకస్ చేసింది. కరోనా నిబంధనల విషయంలో ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని తప్పక అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.