Eluru: ఏలూరు ఎన్నికల కౌంటింగ్ ఇవాళే.. ఎవరిది గెలుపు?

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ(25 జులై 2021) ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఇందు కోసం అధికారులు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు.

10TV Telugu News

Eluru Municipal Corporation elections: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ(25 జులై 2021) ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఇందు కోసం అధికారులు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను మొత్తం రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి.

ఈ మార్చి 10న ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలు పోలింగ్ జరగగా.. హైకోర్టు ఆదేశాలతో లెక్కింపు నిలిచిపోయింది. మళ్లీ హైకోర్టు ఆదేశాలు రావడంతో ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50డివిజన్లు ఉండగా ఇప్పటికే మూడు ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ 47, తెలుగుదేశం 43స్థానాల్లో పోటీ చేయగా.. జనసేన 19, భాజపా14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ చేశారు.

నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించగా,, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టెస్టులు చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని రావాలని ఆదేశించారు. అలాగే మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతించరు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.

10TV Telugu News