Mangalagiri Anna Canteen : మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం.. పంతం నెగ్గించుకున్న తెలుగుదేశం

గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చేసిన చోటే క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం..(Mangalagiri Anna Canteen)

Mangalagiri Anna Canteen : మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం.. పంతం నెగ్గించుకున్న తెలుగుదేశం

Mangalagiri Anna Canteen

Anna Canteen : గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చేసిన చోటే క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టెంట్ వేసిన టీడీపీ నేతలు.. పేదలకు రెండు రూపాయలకు భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అనుమతులు లేవంటూ పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామంటూ టీడీపీ చేసిన ప్రకటనతో మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మున్సిపల్‌ సిబ్బంది తొలగించడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలగించిన చోటే క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతలు మళ్లీ ప్రకటించడంతో అక్కడి ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర శుక్రవారం భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పెద్దఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత టెంట్‌కు అన్న క్యాంటీన్‌ బ్యానర్లు కట్టి అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు.(Mangalagiri Anna Canteen)

ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పేదలకు అన్నం పెడతామంటే ప్రభుత్వానికి ఎందుకంత కడుపుమంట అని టీడీపీ సీనియర్‌ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. పేదల పొట్టకొట్టేలా అన్న క్యాంటీన్‌ తొలగింపు సిగ్గు చేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే అత్యుత్సాహంతోనే మున్సిపల్ అధికారులు, పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

AP Anna Canteen : కడపలో పెట్రోలు బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేత

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీ ఎక్కడా తగ్గడం లేదు. ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడుతున్నాయి. టెన్త్ ఫలితాలపై నారా లోకేష్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ ప్రత్యక్షమవడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందమూరి బాలకృష్ణ జన్మదినం, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించింది. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్మాణాల్లో కొన్నింటిని వైసీపీ ప్రభుత్వం కూల్చి వేసింది. మరికొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చింది.(Mangalagiri Anna Canteen)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని టీడీపీ ఎప్పటి నుంచో పట్టుబడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీనే వాటిని స్వయంగా ఏర్పాటు చేసింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. గత నెలలో హిందూపురంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్

ఆ తర్వాత గుంటూరులోనూ టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లు తమ సొంత నిధులతో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో గురువారం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్మాణం కొంత వివాదానికి దారితీసింది. అనుమతులు లేకుండా నిర్మించారంటూ అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అడ్డుకున్నా టీడీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకులు శుక్రవారం మళ్లీ అన్న క్యాంటీన్ ప్రారంభించడం టెన్షన్ కు దారితీసింది.