Sri Veerabhadraswamy : ఆగస్టు 2 నుంచి శ్రీ వీరభద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగుతాయి.

Sri Veerabhadraswamy : ఆగస్టు 2 నుంచి శ్రీ వీరభద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Sri Veerabhadraswamy

Sri Veerabhadraswamy : తిరుపతి నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలుగా అందజేస్తారు.

ఆగస్టు2వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

ఆగస్టు 3వ తేదీ బుధవారం సాయంత్రం సింహవాహనం, ఆగస్టు 4 గురువారం సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 5 శుక్రవారం సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 6 శనివారం రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఆగస్టు 7 ఆదివారం సాయంత్రం గజవాహనం, ఆగస్టు 8 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.

ఆగస్టు 9 మంగళవారం సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, రాత్రి 7 గంట‌ల‌కు అశ్వవాహనం, ఆగస్టు 10 బుధవారం ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, సాయంత్రం 6 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.