Movie Theaters Seize : ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 థియేటర్లు సీజ్

నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కుపైగా సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు.

Movie Theaters Seize : ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 థియేటర్లు సీజ్

Movie Theaters Seize

Movie Theaters Seize : నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కుపైగా సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు. మరికొన్నింటి సీజ్ చేశారు. శుక్రవారం అధికారులు చేసిన తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 థియేటర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మరోవైపు టికెట్ ధరల విషయంలో సినీ పరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు థియేటర్లు నడపలేక మూసేస్తున్నారు. తాజాగా అనంతపురంలో స్వచ్చందంగా 4 థియేటర్లు మూసేశారు.

చదవండి : AP Movie Theaters: ఆగని అధికారుల దాడులు.. థియేటర్ల మూసివేత!

మరోవైపు అధికారులు థియేటర్లలోని వసతులను పరిశీలించి నోటీసులు జారీ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆకస్మిక తనిఖీ చేపట్టారు. థియేటర్ క్యాంటిన్‌‌లో ధల పట్టిక పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 12 థియేటర్లను అధికారులు మూయించారు. టిక్కెట్ల ధరలు తగ్గించడంతో జిల్లాలో 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. మొత్తం మీద జిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి.

చదవండి : AP Movie Theaters: ఆగని అధికారుల దాడులు.. థియేటర్ల మూసివేత!

ఇక గుంటూరు జిల్లాలో అధికారులు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. 70 థియేటర్లను తనిఖీచేసి అధికారులు 35 థియేటర్లకు నోటీసులు జారీ చేయగా.. 15 సినిమాహాళ్లను సీజ్ చేశారు. గుంటూరులో ప్రముఖ థియేటర్ శ్రీ లక్ష్మి థియేటర్ మూతపడింది. ఇక బీఫామ్ రెన్యూవల్ చేయని 25 థియేటర్లకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్దంగా శ్యామ్ సింగరాయ సినిమా బెనిఫిట్ షో ప్లే చేసిన థియేటర్లకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు అధికారులు. ఎటువంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండానే థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.