పవన్ కళ్యాణ్‌కు మరో పెద్ద కష్టం, వారు కూడా దూరం అవుతున్నారు

  • Published By: naveen ,Published On : October 21, 2020 / 11:53 AM IST
పవన్ కళ్యాణ్‌కు మరో పెద్ద కష్టం, వారు కూడా దూరం అవుతున్నారు

pawan kalyan : గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి చూసుకుంటే జన సైనికులు మాత్రమే సేనానికి అండగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వారు సైతం పార్టీకి మెల్లమెల్లగా దూరం అవుతున్నారని చెబుతున్నారు.

నడిపించే నాయకులు లేక కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా పార్టీకి దూరం:
కష్టాల్లో ఉన్న పార్టీకి కొండంత అండలా బీజేపీ దొరికిందనే ఆనందం లేకుండా పోయిందట. పార్టీలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీని, జనసైనికులను నడిపించే నాయకులు పార్టీలో లేకపోవడంతో కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా పార్టీకి దూరం అవుతున్నారని అంటున్నారు. దీనికి తోడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ… బీజేపీకి సన్నిహితంగా ఉండడం జనసేనకు ఇబ్బందిగానే మారింది. జనసేనను బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.


https://10tv.in/big-relief-for-pawan-kalyan/
పవన్ కల్యాణ్‌ తీరుపైనా ఆవేదన:
మరోపక్క, అధినేత పవన్ కల్యాణ్‌ తీరుపైనా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. కొంతకాలంగా పవన్ బయటకు రాకపోవడం, అటు పార్టీపరంగా ఇటు ప్రజా సమస్యలపైనా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై పార్టీ క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉందంటున్నారు. ఇదే సమయంలో పవన్ పూర్తిగా బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు లోలోపల ఫీలవుతున్నారని టాక్‌.

ఎలా డీల్ చేస్తారో, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో?
మొత్తానికి పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మారుతున్న సమీకరణాలు మరింత కష్టాల్ని తెచ్చి పెడుతున్నాయనే ఆవేదన పార్టీ కేడర్‌లో వ్యక్తం అవుతోంది. మరి ఈ నిరుత్సాహాన్ని జనసేనాని పవన్‌ ఎలా డీల్‌ చేస్తారో? పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సిందే.