ఏపీలో కొత్తగా 1160 కరోనా కేసులు

10TV Telugu News

1160 new corona positive cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1160 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. నిన్నటి సంఖ్యతో పోలిస్తే 61 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,61,092 కి చేరింది.గడిచిన 24 గంటల్లో 7గురు కొవిడ్ తో మృతి చెందారు. దీంతో తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,927మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1,765 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,39,395 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 95,43,177 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యా ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.covid test report

10TV Telugu News