కామధేనువు : రోజుకు 10 లీటర్లు..9 ఏళ్లుగా పాలు ఇస్తూనే ఉన్న ఆవు

  • Published By: nagamani ,Published On : November 20, 2020 / 11:03 AM IST
కామధేనువు : రోజుకు 10 లీటర్లు..9 ఏళ్లుగా పాలు ఇస్తూనే ఉన్న ఆవు

AP Anantapur cow nine years continuously milk : ఓ ఆవు ఏకంగా తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా పాలు ఇస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా పాలు ఇవ్వకుండా మానలేదు. అలారోజుకు ఏకంగా 10లీటర్ల పాలు ఇస్తోంది. ఆ పాల ఆదాయంతో ఆ రైతుకుటుంబం హాయిగా బతికేస్తోంది. ఆ కుటుంబం పాలిట ఆ ఆవు ‘కామధేనువు’గా మారింది.



వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని తాడిమర్రికి చెందిన రైతు వీరనారప్ప. ఇతనికి ఓ ఆవు ఉంది. ఆ ఆవుని వీరనారప్ప 2011లో కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ లో రూ.40 వేలకు కొన్నాడు. దానికి ఓ దూడ పుట్టింది.ఆ దూడను జాగ్రత్తగా పెంచి రూ.45 వేలకు అమ్మాడు. అంటే అప్పటికే ఆవును కొన్న డబ్బులకంటే ఎక్కువే వచ్చింది వీరనారప్పకు.




https://10tv.in/pet-dogs-death-chhattisgarh-woman-kills-self/
ఇకపోతే ఆ ఆవు తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా పాలు ఇస్తూనే ఉంది. అలా ఐదు నెలల క్రితం వరకూ రోజుకు 10లీటర్ల పాలు ఇచ్చేది. ప్రస్తుతం మూడు లీటర్ల పాలు ఇస్తోంది. ఆ పాలమీద ఆదాయంతో ఇప్పటి వరకూ మంచి ఆదాయాన్ని పొందాడు వీరనారప్ప.


కాగా..ఈ ఆవు తొమ్మిదేళ్లుగా నిరంతరం పాలివ్వటానికి కారణం గురించి పశువుల డాక్టర్ గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..ఆ ఆవు రక్తంలో ఆక్సిటోసిస్హార్మోన్ల ప్రభావరం ఎక్కువగా ఉండి ఉంటుందని అందుకే అన్ని సంవత్సరాల నుంచి పాలు నిరంతరం ఇస్తోందని తెలిపారు.



కాగా ఆవు చూడి (గర్భం)దాల్చిస్తే అది ప్రసవించటానికి అంటే ఈనటానికి సుమారు 285 రోజులు పడుతుంది. అంటే సుమారు 9 నెలలు. అచ్చు మనిషిలాగానే ఆవు కూడా తొమ్మిది నెలలు బిడ్డను మోసి ఈనుతుంది. అందుకే మనిషికి ఉండే విచక్షణ ఆవులకు ఉంటాయని అంటారు. ఆవు తన యజమానికి చక్కగా గుర్తు పడుతుంది.పేరు పెడి ప్రేమగా పెంచితే పేరు పెట్టి పిలిస్తే బదులుగా అంబా అని పలుకుతుంది. ఆవులతో మనుషులకు చక్కటి అనుబంధం ఉంటుందని చాలా సందర్భాల్లో నిరూపించబడింది.


ఆవు ఈనిన తరువాత కూడా గేదెలా కాకుండా చాలా నెలల పాటు పాలు ఇస్తుంది. చాలా వరకూ సంవత్సరాలు కూడా పాలు ఇస్తుంది. అందుకే ఇంట్లో ఒక్క ఆవు ఉంటే పాడికి కరవు ఉండదంటారు పెద్దలు.అందుకే ఆవును కామధేనువు అంటారు.