AP, Telangana Water Dispute : రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చించడం లేదు ?

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ప్రశ్నించారు.

AP, Telangana Water Dispute : రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చించడం లేదు ?

Ex Mp Mysura

Ex MP Mysura Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండి ఉంటే..అక్కడి ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదు కదా ? ఇరువురు ముఖ్యమంత్రులు స్నేహపూర్వకంగానే ఉంటారు…మరి నీటి కేటాయింపుల విషయంలో ఎందుకు కలిసి చర్చించుకోరూ అంటూ ప్రశ్నించారు.

Read More : T Congress: కండిషన్స్‌ అప్లై.. కాంగ్రెస్‌లో చేరడం ఈజీ కాదు

జల వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. నోటిఫికేషన్ ను ఆహ్వానించే ముందు..గ్రేటర్ రాయలసీమ ఏపీలో అంతర్భాగమన్న విషయం గుర్తు లేనట్టుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 2021, జూలై 21వ తేదీ బుధవారం మైసురారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజకీయ లబ్ది కోసం కీచులాడుకొని…కేంద్రం చేతిలో పెట్టారని విమర్శించారు మైసురా రెడ్డి.

Read More : Apple Iphone : త్వ‌ర‌లోనే 5జీ బ‌డ్జెట్ ఫోన్లు

గెజిట్ ను స్వాగతించే ముందు…సీఎం జగన్ ఆలోచించాల్సి ఉండేదని, ఇరువురు సీఎంలు మాట్లాడుకోకపోవడం వల్లే..బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. గతంలో గోదావరి నదీ జలాల వివాదాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చించి పరిష్కరించుకున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత…ఇష్టం వచ్చినట్లు విద్యుత్ కేంద్రం నుంచి నీటిని తోడి శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తుంటే ఆంధ్రా పాలకులు నిద్రపోతున్నారా అని సూటిగా ప్రశ్నించారు.

Read More : Telangana Microsoft : తెలంగాణలో రూ.15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

రాయలసీమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారని, ఏదో ఒకరోజు యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ.. నోటిఫికేషన్ వస్తుందన్న విషయం గమనించాల్సి ఉండేదన్నారు. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసి.. భద్రత కల్పించాలని సీఎం జగన్ కి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత బాబు విజ్ఞప్తికి కూడా ఫలితం లేకుండా పోయిందని మాజీ ఎంపీ మైసురా రెడ్డి వెల్లడించారు.