వారంరోజుల్లో పెళ్లి : ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి హత్యాయత్నం

వారంరోజుల్లో పెళ్లి : ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి హత్యాయత్నం

AP : Assassination attempt on a young woman outside the house : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని గట్టుకిందపల్లి గ్రామంలో దారుణం జరిగింగి. ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఆ యువతికి మరో వారం రోజుల్లో వివాహం జరుగనుంది. ఈ క్రమంలో ఇంటి వరండాలో నిద్రపోతున్న ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా మదనపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సదురు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాలోని గట్టుకిందపల్లి గ్రామంలో సుమతి అనే యువతి వారి ఇంటి గత రాత్రి వరండాలో నిద్రిస్తోంది. మిగతా కుటుంబ సభ్యులంతా కిందే పడుకుని నిద్రిస్తున్నారు. అంతా గాఢనిద్రలో ఉండగా..కొంతమంది దుండగులు వచ్చి సుమతిపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. ఈక్రమంలో సుమతి కేకలు పెట్టటం..కుటుంబ సభ్యులకు నిద్రలోపెట్రోలు వాసన రావటంతో సడెన్ గా లేచి చూసారు.

అప్పటికే సుమతికి ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో గాభపడిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పివేసి వెంటనే మదనపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సుమతి తండ్రి మాట్లాడుతూ..మరో వారం రోజుల్లో అంటే డిసెంబర్ 24,2020న మా అమ్మాయి సుమతికి వివాహం జరగనుంది కానీ ఇంతలో ఇటువంటి దారుణం జరగటంతో తామంతా ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో భయాందోళనలకు గురవుతున్నామని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగాకుటుంబ సభ్యులను ప్రశ్నించారు. సుమతికి ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? లేక గ్రామంలో ఎవరైన ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన ఘటనలు ఏమైనా జరిగాయా? అని ప్రశ్నించారు.దానికి సుమతి తండ్రి తమ కూతురుకి అటువంటివేమీ జరగలేదని తెలిపాడు.

దీంతో పోలీసులు సుమతికి తెలియకుండానే గ్రామంలో గానీ లేక చుట్టుపక్కల గానీ ఎవరైనా యువకులు ఆమెపై కన్నేసి ఆమెకు వివాహం నిశ్చయమైంది ఇక తమకు దక్కదని ఇలా హత్యాయత్నానికి తెగబడ్డారా? లేక సుమతి ఇంటిలోవారికి తెలియకుండా ఏమన్నా ప్రేమ వ్యవహారాలు..వేధింపులు వంటివి దాచి పెట్టిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే సుమతి ఫోన్ కాల్స్ ను చెక్ చేయస్తున్నారు.

కాగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సుమతి అపస్మార స్థితిలో ఉంది. ఆమెకు స్పృహ వచ్చి వివరాలు తెలిపితేనే గానీ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించటంలేదు.కానీ పోలీసులు మాత్రం తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.