AP Assembly : 27 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Assembly : 27 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

AP Assembly

AP Assembly : ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి రోజు రెండు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు, వాల్మికి.. బోయలను ఎస్టీలో చేర్చాలని ఒక తీర్మానం, అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. అసెంబ్లీ అమోదించిన రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

పాదయాత్ర చేస్తున్న సందర్బంగా ఎస్టీలో చేర్చాలని బోయ, వాల్మికి కులస్తులు కోరగా ఆ సమయంలో సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయగా సభ ఆమోదం తెలిపింది. అలాగే ఆదివాసీలు, గిరిజనులకు అన్యాయం జరగకుండా చూస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీర్మానం జరిగింది. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

CM Jagan: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చూతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అలాగే, ఏపీ శాసన మండలి కూడా నిరవధికంగా పడింది. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అక్కచెళ్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఉందని సీఎం జగన్ తెలిపారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్ గా ఉందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తోందన్నారు.