AP Assembly Budget Session-2023: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. టీడీపీ సభ్యుల నినాదాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. 11.43 వృద్ధి రేటును సాధించామని చెప్పారు.

AP Assembly Budget Session-2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. 11.43 వృద్ధి రేటును సాధించామని చెప్పారు.
మహిళల భద్రతకు, సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు వస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోందని, అర్హులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చెప్పారు.
కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుతోందని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లామని తెలిపారు. మనబడి- నాడునేడు ద్వారా తొలి దశలో రూ.3,669 కోట్లతో ఆధునికీకరణ చేపట్టామని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తున్నామని తెలిపారు.
ద్విభాషా పుస్తకాలు, ఇంగ్లిష్ ల్యాబ్ ల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. కడపలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు.
అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని గవర్నర్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందుతోందని తెలిపారు. జస్టిస్ నజీర్ం గవర్నర్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో ఆయన చేసిన తొలి ప్రసంగం ఇది.
టీడీపీ సభ్యుల నినాదాలు
గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వం చెప్పిస్తోన్న అసత్యాలు భరించలేకపోతున్నామని అన్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల ప్రస్తావన సమయంలో ‘నో ఇరిగేషన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నినాదాలు చేసుకుంటూ సభను బాయ్ కాట్ చేశారు.
YS Avinash Reddy : వివేక హత్య కేసు.. సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుపై సందిగ్ధత