AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం

AP Assembly

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. బిల్లులు, సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

మార్చి 15,16 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. మార్చి 16న వార్షిక బడ్జెట్ ను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ లో మేనిఫెస్టో పథకాలతో పాటు కొత్త కేటాయింపులు చేసే అవకాశం ఉంది. మార్చి 17న సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చ జరుగనుంది.

Kolagatla Veerabhadra Swamy : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

మార్చి 18న బడ్జెట్ అనంతరం అసెంబ్లీని వాయిదా వేస్తారు. తిరిగి 20, 21, 22, 24 తేదీల్లో వివిధ శాఖల డిమాండ్లు ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 7 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్ష టీడీపీ సిద్ధమవుతుంది. చంద్రబాబు ఈ సమావేశాలకూ కూడా హాజరు కాలేకపోతుండటంతో అచ్చెన్నాయుడు ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అధికార, ప్రతిపక్షానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో సమావేశాలపై ఫోకస్ చేశాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.