CRDA రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ

  • Published By: Subhan ,Published On : June 16, 2020 / 12:14 PM IST
CRDA రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశ పెట్టిన బిల్లును పాస్ చేసినట్లుగా స్పీకర్ ప్రకటించారు. మంగళవారం (జూన్ 16) సాయంత్రం ఏపీ అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికార ప్రభుత్వం రెడీ అయింది. మండలిలో బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహలను సిద్ధం చేసుకున్నా అడ్డుకోలేకపోయింది.

గతంలోనే ఈ రెండు బిల్లులను మండలిలో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వారం రోజులు పాటు మండలి నిర్వహించాలని టీడీపీ కోరిన నేపథ్యంలో రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించి బిల్లు, సీఆర్డీఏ బిల్లలను  కూడా పూర్తిగా వ్యతిరేకిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. 
 
గతంలోనే ఈ రెండు బిల్లలును టీడీపీ  వ్యతిరేకించి కమిటీ కూడా వేసింది. అయినప్పటికీ మళ్లీ అసెంబ్లీ ముందుకు ఈ రెండు బిల్లులు తీసుకురావడం సరికాదని స్పష్టం చేసింది. రెండింటికి సంబంధించి కోర్టులోనూ, గవర్నర్ పరిధిలోనూ రెండు బిల్లులు ఉన్నాయి. వీటిని సభలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని మండలిలో టీడీపీ ప్లాన్ చేసుకుంది.